పురుషునికి వివాహ వయస్సు 21 ఏళ్ళు, స్త్రీ కి ఎందుకు 18 ఏళ్ళు?
మనదేశంలో పురుషునికి వివాహ వయోపరిమితి 21 ఏళ్ళుగా వుంది. కానీ స్త్రీలకు
అయితే ఇది 18 ఏళ్ళుగా మాత్రమే వుంది. ఎందుకీ తేడా ఇప్పుడు ఇదే అనుమానం.
మధ్రాసు హైకోర్టుకు వచ్చింది. పురుషులకన్నా స్త్రీలు చిన్నవయస్సులోనే
మానసిక పరిపక్వత చెందుతారా?
సామాజిక అవగాహన స్త్రీలలో ముందుగా వస్తుందా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.
పురుషులకూ స్త్రీలకూ వివాహ వయోపరిమితిని 21 ఏళ్ళు చేస్తూ సంభందిత చట్టాలను
సవరించాలని హైకోర్టు సూచించింది. ఒకే వయసులో బడిలో చేరతారు. ఒకే వయసులో
బాలబాలికలు పాఠశాల చదువు పూర్తి చేస్తారు. మరి వివాహ వయో పరిమితిలో తేడా
ఎందుకు అని హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది.

Comments
Post a Comment