రికార్డింగ్ డాన్సులు ఎపుడైనా చూసారా ??
మగాళ్ళలొ రికార్డింగ్ డాన్స్ చూడని వారు,
దాని గురించి వినని వారు అరుదు.రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూతమ అంద చందాలను ప్రదర్శించే వేదిక. పండగ, పబ్బాల సందర్భంగా రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లెటూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి.పోలిసుల నిఘా ఎక్కువ కావడం తో ఇప్పుడు రికార్డింగ్ డాన్సులు చాలా రహస్యంగా జరుగుతున్నాయి.రికార్డింగ్ డాన్స్ అంటే పల్లెటూరి ప్రజలే కాదు పట్నం వాసులు కూడా ఎగబడతారు.ఒకప్పుడు రికార్డింగ్ డాన్సులకు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు.ఈ రికార్డింగ్ డాన్స్ లే పట్నాలలో క్యాబరే డాన్సులుగా రూపాంతరం చెందాయి.అయితే రాను రాను ఈ డాన్సులు నగ్న ప్రదర్శనలు గా మారడం తో వాటిని ప్రభుత్వం నిషేదించింది. ఈ నేపధ్యం లొ ఇవి రహస్యం గా జరుగుతున్నాయి. పండగల సందర్భం లొ అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు.గుంటూరు జిల్లా లోని చిలకలూరి పేట ,నరసరావు పేట నాలుగైదు దశాబ్దలు గా ఈ డాన్సులకు ప్రసిద్ధి.వందల సంఖ్యలో అమ్మాయిలు రికార్డింగ్ డాన్సు నే వృత్తి గా మార్చుకుని జీవించే వారు.ఆదరణ బాగుండటం తో అదే జీవనాధారం గా మారింది.పోటీ కూడా పెరిగింది.మొదట్లో సినిమా పాటలకు నర్తించడమే వుండేది. పోటీ పెరిగిన క్రమంలో అందచందాల ప్రదర్శన కు తెర లేచింది.ఆ తర్వాత సెమి న్యూడ్ ,ఫుల్ న్యూడ్ షోలు గా మారిపోయాయి. రికార్డింగ్ డ్యాన్సర్లు హీరొయిన్ల మాదిరిగా పొపులర్ అయిపోయారు.డిస్కో రాధా ,నాగలక్ష్మి , దంపుడు లక్ష్మి అని పేర్లు పెట్టుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే వారు.చుట్టూ పక్కల జిల్లాలకు కూడా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చేవారు.శివ రాత్రి,శ్రీరామా నవమి,వినాయక చవితి పండగలు వచ్చాయంటే ఎక్కడ చూసిన రికార్డింగ్ డాన్సులు తప్పని సరిగా ఏర్పాటు చేసేవారు.కటిక పేదరికం లోని మహిళలు ఈ తరహ డాన్సులు చేయడానికి ముందుకొచ్చేవారు,ఆయా మహిళల భర్తలు ,సోదరులే దగ్గరుండి మరీ ప్రోత్సహించే వారు. ఇష్టం లేకపోయినా మహిళలు,చిన్న పిల్లలు సైతం ముఖాలకు రంగులద్దుకుని బూతు పాటలకు అనుగుణం గా నర్తిస్తూ ప్రేక్షకులను కవ్విస్తూ ,కసేక్కిస్తూ వినోదాన్ని అందించే వారు .భక్తీ పాటలతో మొదలయ్యే ఈ ప్రదర్శనలు క్రమం గా బూతు పాటలతో హోరేక్కించేవి.గుడి ఎనక నా స్వామి..గుర్రమెక్కి కూర్చున్నాడు, లేలే నారాజా,మసకమసక చీకట్లో అంటూ అమ్మాయిలు డాన్సు చేస్తూ మధ్య మధ్యలో కుర్రకారు ను వేర్రేక్కించడానికి గాల్లోకి ముద్దులు విసేరే వారు.దీంతో జనం ఉర్రూత లూగే వారు.సినిమా తెర మీద చూసిన డాన్సులు ఇక్కడ కళ్ళ ముందు మెదులు తుంటే ప్రేక్షకులు ఓ రకమైన కిక్కు తో కసేక్కి పోయేవారు.కొందరైతే డబ్బులు స్టేజి మీదకు విసేరే వారు ,ఇంకొందరు స్టేజి ఎక్కి రూపాయల దండలు అమ్మాయిల మెళ్ళో వేసే వారు. మరికొందరు ఈలలు కేకలతో తమ ఆనందాన్ని చాటుకునే వారు. ప్రేక్షకుల్లో స్పందన గమనించి డాన్సర్లు కూడా మరింత గా కవ్వించేవారు,కైపెక్కించే విధంగా అవయువ ప్రదర్శనకు పూనుకునే వారు. ఈ ప్రదర్శనలు చూసేందుకు మహిళలు వచ్చే వారు కాదు ,ఒక వేళ వచ్చినా వారిని పంపిన తర్వాతనే దశల వారీ గా నగ్నప్రదర్శన మొదలయ్యేది.ఆ జాగ్రత్తలు తీసుకునే వారు.
ఇటీవల ఒక రికార్డింగ్ డ్యాన్సర్ ని కలిసాను . ఒకప్పుడు ఆమె చాల పాపులర్ డాన్సర్. ఎంతో మంది శిష్యురాళ్ళను తయారు చేసింది. స్వయం గా వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చింది అయితే సంపాదించింది అనుభవం మాత్రమే.అదిప్పుడు కూడు పెట్టడం లేదు. ఆమెతో చాలా విషయాలు ముచ్చటించాను. కళను ఎలా కమర్షలైజ్ చేసారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
"న్యూడ్ షో లు మొదట్లో ఉండేవి కావు... మా డ్యాన్సర్ల ట్రూప్ మాస్టర్ల స్వార్ధం వల్లే మొదలయ్యాయి. జనాన్ని ఎంత రెచ్చ గోడితే ఆ ట్రూప్ కి అంత డిమాండ్ ఉంటుందన్న భావన తో నగ్నప్రదర్శన కు మమల్ని బలవంతం గా ఒప్పించే వారు " అని ఆ వృద్ధ డాన్సర్ చెప్పింది.
"మేము అలా అందరి ముందు పబ్లిక్లో నగ్న ప్రదర్శనలు ఇవ్వడానికి కారణం పేదరికమే ,పిల్లలకు ఒక పూట అయినా కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆశ మాత్రమే .అంతే గానీ మా నగ్నత్వాన్ని చూపించి డబ్బులు కొల్ల గొట్టాలని కాదు."
"మేము కూడా గౌరవ కుటుంబాలకు చెందిన మహిళల లాంటి వాళ్ళమే.మాకూ సిగ్గు,అభిమానం వున్నాయి. అయితే గత్యంతరం లేని పరిస్తితుల్లో స్టేజి ఎక్కి డాన్సు వేశాం. అయితే కొంతమంది స్వార్ధ వైఖరి వల్ల ఈ వృత్తి కూడా అభాసుపాలైంది."
"కొంతమంది అమ్మాయిలు తమ అందచందాలతో జనాన్ని రెచ్చగొట్టే వారు,ఈ క్రమం లో కొంతమంది మగాళ్ళు డబ్బు ఎరవేసి వీళ్ళను లోబర్చుకునే వారు.అలా అలా రికార్డింగ్ డాన్సింగ్ వృత్తి కలుషితమైంది.ఆ తర్వాత అసలు దాని పోకడే మారి పోయింది.
కేవలం వినోదం కోసం మొదలైన ఈ స్టేజి షో లు అశ్లీలతకు నమూనాగా మారిపోయాయి."
"పిల్లలను బతికించు కోవడం కోసం రికార్డింగ్ డాన్సులు మీరు చేశామంటున్నారు? మరి చిన్న పిల్లల తో కూడా ఇలాంటి అసభ్య నృత్యాలు చేయించే వాళ్ళు కదా ?దీన్ని మీరు సమర్ధిస్తారా ?"అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ "అది తప్పే.మా డాన్సు ట్రూప్ నిర్వాహకుల స్వార్ధం వల్లనే చిన్న పిల్లలు స్టేజి ఎక్కారు.మేమంటే చదువు లేని వాళ్ళం ,నాగరికత తెలినీ వాళ్ళం.మరిప్పుడు టీవీ లలో వచ్చే డాన్సు షో లలో చిన్న పిల్లలు చేసే నృత్యాలు ఏ కొవలోకొస్తాయి?మీరే చెప్పండి ??"అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
జవాబు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు .

Comments