ఆంధ్ర కి దిష్టి బొమ్మ తగిలించండి

ఆంధ్రప్రదేశ్అంటేనే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కారాలు మిరియాలు నూరుతున్నాయట. తమ లోపాలను అవకాశంగా మలుచుకుని పెట్టుబడులు తరలించుకపోతున్నారంటూ ఏపీపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.
కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను తమకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాయి. తమ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నది ఆత రాష్ట్రాల ఫిర్యాదు. తమ వద్ద ఒప్పందాల దశలో ఉన్న పరిశ్రమలను కూడా ఏపీకి తరలిపోతుండడంతో ఆయా రాష్ట్రాలు మరింత ఆలోచనలో పడ్డాయి.


దక్షణాది యూనిట్ను నెలకొల్పాలనుకున్న హీరో మోటార్కార్పొరేషన్మూడు నాలుగు రాష్ట్రాలు తిరిగి చివరకు ఏపీ వైపు మొగ్గు చూపింది. ఏసియన్పెయింట్స్కంపెనీ కూడా దక్షణ కోస్తాలో ఒకటి.. ఉత్తర కోస్తాలో మరొకటి చొప్పన రెండు రీజియన్లలో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఒక్కో యూనిట్కోసం 2వేల కోట్ల కేటాయించనుంది. అధికారికంగా ప్రకటించకపోయినా.. దాదాపు నిర్ణయానికి వచ్చారు. అయితే ఇదే వ్యవహారంలో కర్నాటక ఏపీపై మండిపడుతోంది. తమ రాష్ట్రంతో ఒప్పందాల దశలో ఉన్న ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇస్తామని ఎగరేసుకపోయే ప్రయత్నం చేస్తుందన్నది కన్నడ సర్కార్ఆరోపణ. ఇది హెల్తీ కాంపిటేషన్కాదంటూ ప్రధాని దృష్టికి  కన్నడ సిఎం సిద్ధరామయ్య తీసుకెళ్లారట. అక్కడ భూ వివాదాలే కంపెనీ నిర్ణయం మార్చుకోవడానికి కారణమని తెలుస్తోంది.
అటు తమిళనాడుకు చెందిన పలు పరిశ్రమలు కూడా తమ యూనిట్లను ఏపీకి మార్చడానికి సిద్ధమవుతున్నాయి. కోయంబత్తూర్ప్రాంతంలో ఉన్న స్పిన్నింగ్అండ్టెక్స్టైల్పరిశ్రమలు పెద్దెత్తున ఏపీకి తరలనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ పేపర్పరిశ్రమ కూడా తమళనాడు నుంచి కోస్తాంధ్రకు లొకేషన్మార్చబోతుంది. అక్కడ విద్యుత్కోతలతో విసిగిన పరిశ్రమల యాజమాన్యాలకు ఏపీ అనుకూలంగా కనిపిస్తోంది. ఇక్కడ 24గంటలు విద్యుత్సరఫరాతో పాటు.. రాయితీలు ప్రకటిస్తుండడంతో పెట్టబడిదారుల చూపు ఇటు పడుతోంది.


ఏపీ మాత్రం ఆయా రాష్ట్రాల ఫిర్యాదులను ఖండిస్తోంది.. పెట్టబడిదారులు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తారని ఇందులో ఫిర్యాదులకు చోటులేదని స్పష్టం చేస్తోంది.

Comments