అక్కడ ధరలు పెరిగితే వెంటనే నడ్డివిరుస్తారు : ధరలు తగ్గితే మాత్రం ఆ ఫలాన్ని వినియోగదారుడికి అందనీయరు

తగ్గుతున్న ముడిచమురు ధరల ఫలాలు సగటు వినియోగదారుడికి అందడం లేదు. అంతర్జాతీయ ధరలకనుగుణంగా పక్షానికోమారు సామాన్యులపై భారం వేసిన కంపెనీలు.. ఇప్పుడు మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పతనమవుతున్నా.. నామమాత్రపు సర్దుబాట్లతో సరిపెడుతున్నాయి. ఆయిల్ధరలపై నియంత్రణ ఎత్తేసిన సర్కార్మళ్లీ తన అదుపులోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.

గత ఏడాది 2013 మే నుంచి సెప్టంబర్మధ్యలో పెట్రోల్ధరలను ఆయిల్కంపెనీలు భారీగా పెంచాయి. నాలుగు నెలల కాలంలో 20.6శాతం అంటే 12.97 పైసలు పెంచాయి. ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లు నుంచి 115 డాలర్ల మధ్య పలికింది. హెచ్చుతగ్గుల మొత్తం కలుపుకుంటే 12.8శాతం క్రూడ్అయిల ధరలు పెరిగితే... పెట్రోల్ధరలు 20.6శాతం పెంచాయి. పెట్రోల్ధరల విషయంలో అప్పటికే సర్కార్నియంత్రణ ఎత్తేయడంతో లాభాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ముడిచమురు, రూపాయి ట్రేడింగ్ఆధారంగా ధరలను నిర్ణయించాయి. అప్పుడు డాలర్తో రూపాయి 57 నుంచి 63 రూపాయల మధ్య ట్రేడైంది. ఆగస్టు 29 రికార్డు స్థాయిలో 68.83 పైసలు వద్ద ట్రేడైంది. జులై 15 నుంచి సెప్టంబర్‌ 15 మధ్యలో రూపాయి విలువ మరింత పతనమైందన్న సాకుతో రెండు నెలల కాలంలోనే పెట్రోల్ధర 8 రూపాయల వరకూ పెంచాయి. క్రూడ్ఆయిల్ధరలు పెరిగినా.. రూపాయి క్షీణించినా సామాన్యులపై భారం వేయడానికి కంపెనీలు ఏమాత్రం ఆలోచించలేదు.
ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రూపాయి రూ.61.30 అటు ఇటుగా ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కూడా 82 డాలర్లకు పడిపోయాయి. ఏడాది జూన్లో 115 డాలర్లు పలికిన క్రూడ్ఆయిల్ధరలతో పోల్చితే ఇప్పుడు 25శాతానికి పడిపోయింది. అయినా భారతీయ ఆయిల్కంపెనీల ఇంకా రిటైల్మార్కెట్లో నెలవారీ నామమాత్రపు సర్దుబాట్లతో ప్రజలను మభ్యపెడుతున్నాయి. జులై నుంచి క్రూడ్ధరలు 25శాతం పతనమైతే రిటైల్మార్కెట్లో 7.8శాతం మాత్రమే పెట్రోల్ ధరలు తగ్గాయి. గత ఏడాది ముడి చమురు ధర 12.8 శాతం పెరిగితే నాలుగు నెలల్లో 20.6శాతం పెట్రోల్ధరలు పెంచాయి.. ముడిచమురు ఇప్పుడు 25శాతం పడిపోయింది.. కాబట్టి వారి లెక్క ప్రకారమే పెట్రోల్ధరలు 40శాతం తగ్గాలి. ఒకవేళ రూపాయి విలువలో మార్పులు.. రవాణా ఛార్జీల భారం పెరిగిందని భావించినా 30-35శాతం వరకూ అంటే 20 నుంచి 25 రూపాయల వరకూ పెట్రోల్పై ప్రజలకు భారం తగ్గించాలి. కానీ 5రూపాయల 74 పైసలు మాత్రమే తగ్గించి కంపెనీలు చేతులు దులుపుకున్నాయి. డీజిల్లో వస్తున్న నష్టాలు పూడ్చుకుంటున్నామని కంపెనీలు చెప్పడానికి కూడా లేదు.. ఎందుకంటే రాయితీల భారం తగ్గించుకున్న తర్వాత ఆయిల్కంపెనీలకు లీటర్డీజిల్పై 3 రూపాయల 56 పైసలకు పైగా లాభమొస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఒక్క డాలర్తగ్గితే భారత్కు 6వేల కోట్ల రాయితీల భారం తగ్గుతోంది. అటు పెట్రోల్పై కూడా వేల కోట్ల డాలర్ల లాభాలొస్తున్నాయి. అయినా వినియోగదారులపై భారం తగ్గించడానికి వాటికి మనసు రావడం లేదు. కంపెనీలు లాభాలు చూసుకుంటున్నాయి. ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసి తమకు సంబంధం లేదంటోంది..
వాస్తవానికి అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడిచమురు ధరలను ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇది సరైన సమయం. ధరలు అదుపులో ఉండేలా చేస్తే రవాణా ఛార్జీలు తగ్గుతాయి.. నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. రూపాయి కూడా ఫారెక్స్ మార్కెట్లో మరింతబలపడుతుంది. ఇవన్నీ భారతీయ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇదంతా జరగాలంటే కంపెనీల చేతిలో నుంచి ఆయిల్ధరలపై నియంత్రణ మళ్లీ సర్కార్తన చేతిలోకి తీసుకోవాలి. మరి మోడీ సర్కార్సర్కార్కు ఇటు ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని తీసుకుంటారా? ఆయిల్కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తారా? చూడాలి.

Comments