ఒకసారి కిందపడితే పైకి లేవచ్చు..
అలలైతే ఇంకా వేగంగా స్పందిస్తాయి.. మరి చెట్టు కిందపడితే
.. ఒక్కసారి కుప్పకూలితే..
ఇక దానిపని అయిపోయినట్లేనా..
కానీ చాలా మందికి పడిపోయిన చెట్టును కూడా బతికించవచ్చనే విషయం తెలియదు..
నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం..
అదెలాగో మీరే చూడండి...
మోడుగా మారిన ఈ మానులు మళ్లీ చిగురిస్తాయా..?
అలాంటి అవకాశం ఉందా..?
అవుననే అంటున్నారు పర్యావరణ వేత్తలు.. విరిగిపోయిన కొమ్మలన్నీ కట్
చేస్తే చెట్లు మళ్లీ చిగురిస్తాయంటున్నారు.. ప్రూనింగ్
ప్రక్రియతో సాధ్యమేనని చెబుతున్నారు వృక్ష విభాగం శాస్త్తవేత్తలు..
ప్రూనింగ్ ప్రక్రియతో చెట్లను బతికించాలంటే వారం రోజుల్లోనే పని పూర్తి చేయాలి.. ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేయాలి.. ఇదంతా యుద్ధప్రాతిపదికన జరగాలి..
దీనివల్ల దాదాపు సగం చెట్లు బతికించవచ్చంటున్నారు నిపుణులు..
తల్లి వేళ్లతో సహా పెకిలించుకుని కిందపడిన చెట్లు మినహా..
మిగిలిన వాటన్నింటికీ ప్రాణం పోసే అవకాశం ఉందంటున్నారు.. ప్రూనింగ్తో పాటు అవసరమైన ఎరువులు వాడితే చాలా వరకు చెట్లను బతికించే ఛాన్స్ ఉందంటున్నారు ఉద్యానవన విభాగం శాస్త్రవేత్తలు..
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం కూడా ఈ దిశగా కసరత్తు చేస్తోందంటున్నారు మంత్రి నారాయణ.. 40 శాతం డ్యామేజైన చెట్లను బతికించే అవకాశం ఉందని చెబుతున్నారు..
విదేశాల్లో ఈ ప్రక్రియను ఎక్కువగా అవలంభిస్తుంటారు. భారీ వృక్షాలను సైతం మరోచోటకు చేర్చి ప్రాణం పోస్తుంటారు..
విశాఖలోనూ చెట్లను బతికించేందుకు ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఇందుకు సమయం కూడా ఎక్కువ లేదు... డబ్బు ఖర్చయ్యే ప్రక్రియ అయినప్పటికీ చెట్టు చేసే మేలు వెలకట్టలేనిది..
మొక్క పెరిగి పెద్దయ్యేందుకు తీసుకునే సమయం కూడా చాలా ఎక్కువ.. ప్రస్తుతం ప్రూనింగ్
ప్రక్రియ ద్వారా మోడుగా మారిన చెట్లకు జీవం పోయడమే ఉత్తమం..

Comments
Post a Comment