ఆంద్రప్రదేశ్
రాజధాని చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు
ఆరంభిం చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా సుమారు 180 కిలోమీటర్ల మేర
ఔటర్ రింగ్‌రోడ్డు రూపు దిద్దుకోనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా
ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగు వేల ఎకరాలు అవసరం
అవుతాయని ప్రభు త్వం అంచనా వేసింది. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం
రూ.19,700 కోట్లు. ఇందులో అధికశాతం మొత్తం భూసేకరణ కోసం ఖర్చు చేయొచ్చని
తెలుస్తోంది. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు నుంచి కేంద్రం ఆర్థిక
సహాయం అందించే అవకా శాలు ఉన్నాయి. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా)
నుంచి కూడా రుణం తీసుకోవచ్చని సమాచారం. పబ్లిక్- ప్రయివేట్ భాగస్వామ్యం
(పిపిపి) పద్దతిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించనున్నారు. సిఎం చంద్రబాబు
త్వరలో నిర్వహించబోయే జపాన్ పర్యటనలో ఔటర్ రింగ్‌రోడ్డు ముసాయిదా
ప్రతిపాదనలను జైకా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా
వివరించనున్నారు.
రాష్ట్ర ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర ఎనిమిది లేన్ల వెడల్పుతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మితమైన విషయం తెలిసిందే. అదే తరహాలో కొత్త రాజధాని రవాణా అవసరాల కోసం ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయిదేళ్లలో కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం నిర్దుష్ట ప్రణాళికను ప్రకటించిన నేపథ్యంలో రాజధానితో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఈ ఏడాది ఆగస్టులో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. దీనిపై ఆ శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్టు కింద ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అవసరమైనంత మేరకు ఆర్థిక సాయం అందిస్తామని, దీనికి అవసరమైన భూమిని మాత్రం ప్రభుత్వమే సేకరించి తమకు అప్పగించాలని సూచించింది. కేంద్రం సానుకూలంగా స్పందించ డంతో ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనలను రూ పొందించే పనిలో పడింది. దీనికోసం ఓ కన్సల్టెన్సీని నియమించుకోనుంది. విజయవాడ-గుంటూరు- తెనాలి-మంగళగిరిలను కలుపుతూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మితం కానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 35 మండలాల మీదుగా దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మున్ముందు మరిన్ని మండ లాలను ఔటర్ పరిధిలోకి తీసుకుని వస్తారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే సమయానికి మండలాల సంఖ్య 50 దాటొచ్చని తెలుస్తోంది. ఈ రింగ్‌రోడ్డు కార్యరూపం దాల్చితే ఆసియాలోనే అతిపెద్ద ఔటర్‌గా ఆవిర్బ Ûవిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఇన్నర్ రింగ్‌రోడ్డును నిర్మించే వీలు ఉంది. దీని పొడవు 75 కిలోమీటర్లు. ఔటర్-ఇన్నర్ రింగ్‌రోడ్డు మధ్య 15 కిలోమీటర్ల గ్రీన్ బెల్ట్‌ను నిర్మిస్తారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి 4,050 ఎకరాలు అవసరం అవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాజధాని నిర్మాణా నికి సేకరించే భూమితో పాటే ఔటర్ కోసం భూమిని సేకరించాలని యోచిస్తోంది. ఎన్‌హెచ్‌డీపి కింద కేంద్రం అందించే ఆర్థిక సాయం కేవలం రోడ్డు నిర్మా ణానికే పరిమితం కానుంది. భూసేకరణ బాధ్యత, నష్టపరిహారం చెల్లింపు వంటి కార్యకలాపాలను రా ష్ట్రమే చేపట్టాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం దీనికి వర్తించదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత మేర నష్ట పరిహారాన్ని చెల్లిస్తుందన్నది ఆసక్తికరం.
ముసాయిదా నివేదిక ప్రకారం
ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోకి వచ్చే ప్రాంతాలివీ..
కృష్ణా జిల్లాలో.. పటమట లంక, బట్ల పెనుమర్రు, పామర్రు, గుడివాడ, నందివాడ, తుమ్మనల పల్లి, రామాపురం, హనుమాన్ జంక్షన్, గొల్లపల్లి, మీర్జాపురం, నూజి వీడు, తోలుకోడు, మైలవరం, గంగినేని, ఆలూరు, కంచికచర్ల, పరిటాల, చింతల పాడు, మొగులూరు
గుంటూరు జిల్లాలో..అమరావతి, నెమలికన్ను, పెదకూరపాడు, వలివేరు, వేటపాలెం, సీలపాడు, చినరావూరు, జంపని, కొల్లూరు.

Comments
Post a Comment