నవ్యాంధ్రకు మహర్దశ పట్టుకుంది. ఏపీ సర్కార్పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే ఔటర్ రింగ్
రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోడీ సర్కార్
తాజాగా నాలుగో జాతీయ జలమార్గంపై దృష్టిసారించింది.
దేశంలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న జలామార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది.
కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకున్న 1078 కిలోమీటర్లు మార్గాన్ని జాతీయ జలమార్గంగా ప్రకటించింది.
ఈ మార్గం ద్వారా సరకు, ప్రజారవాణాను ప్రోత్సహించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు,
పుదుచ్చేరిలోని 20 జిల్లాల మీదుగా మూడు ఓడ రేవులను కలుపుతూ మార్గం వెళ్తోంది.
కృష్ణా, గోదావరి బేసిన్తో పాటు నీటి పారుదల, ఉప్పునీటి కాలువలను అంతర్ రాష్ట్ర రవాణామార్గాలుగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
ఆంధ్రాకు మణిహారమైన,
అత్యధిక సరకు రవాణా సామర్థ్యం కలిగిన కాకినాడ-పుదుచ్చేరి నాలుగో జాతీయ జలమార్గం ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తక్కువ ఖర్చుతో జలమార్గాల ద్వారా... సరకు,
ప్రజా రవాణాకు వీలుగా వివిధ మార్గాలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
నాలుగో జాతీయ జలమార్గం ప్రధాన కార్యాలయాన్నీ విజయవాడలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది.
డిసెంబర్లో టెండర్ పిలిచి దాదాపు
1515 కోట్ల పెట్టుబడితో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం సొంతంగా పనులు మొదలుపెట్టనుంది.ఈ రవాణా మార్గం సుగమం అయితే ఏటా 11 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
తొలి విడతలో
100 టన్నులు, రెండో విడత నాటికి 300 టన్నుల మేరకు సరకు రవాణా సామర్థ్యం కలిగిన ఓడలు ప్రయాణించేందుకు వీలుగా జలమార్గాలను ఆధునికీకరించనుంది.
ఈ ప్రాజెక్టు పరిధిలో అత్యధిక మార్గం నవ్యాంధ్ర మీదుగానే వెళ్తోంది. ఇందులో కృష్ణా, గోదావరి నదీ మార్గాలు, కాకినాడ,
ఏలూరు, కొమ్మమూరు, ఉత్తర,
దక్షిణ బకింగ్ హామ్,
కాలువెర్లి ట్యాంక్ కాలువలు ఉన్నాయి.
కాకినాడ నుంచి తడ వరకు 888 కిలో మీటర్ల మార్గం ఏపీలోనే ఉంది.
మరోవైపు భూముల సేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జల మార్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కాలువలకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్ని సేకరించేందుకు రెడీ అవుతోంది.
దాదాపు 1380 హెక్టార్ల భూముల్ని ప్రాజెక్టు నిమిత్తం తీసుకోవాలని అంచనా వేస్తోంది.

Comments
Post a Comment