ఉదయాన్నే మంచి కాఫీ తాగితే కలిగే ఆ అనుభూతే వేరు. ఆ కాఫీ పరిమళం రోజంతా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మార్కెట్లో రకరకాల కాఫీ పౌడర్లు లభిస్తున్నాయి. వాటిలో మంచి కాఫీ ఏది అని పరిశీలిస్తే... దేశవిదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన సీసీఎల్ కాఫీ ప్రాడక్ట్స్ ముందు వరుసలో కనిపిస్తాయి. గుంటూరు
జిల్లా
దుగ్గిరాలలో
తయారయ్యే
ఈ కాఫీకి స్విట్జర్లాండ్లో కూడా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
కాఫీ ప్రాడక్ట్స్లో సీసీఎల్ విలక్షణం. 1994లో చిన్నగా మొదలైన సీసీఎల్ ప్రస్థానం నేడు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకునేంత వరకూ చేరింది. నేడు సీసీఎల్కు గుంటూరు జిల్లా దుగ్గిరాలతో పాటూ వియత్నాం, స్విట్జర్లాండ్లలో సైతం కాఫీ ప్లాంట్లున్నాయి.
కాఫీకి బ్రెజిల్ పెట్టింది పేరు. అలాంటి బ్రెజిల్, యూరోపియన్ టెక్నాలజీతో పాటూ స్థానిక అవసరాలకు తగినట్లు రూపొందించుకున్న టెక్నాలజీతో సీసీఎల్ విస్తృతమైన కాఫీ ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేస్తోంది. సీసీఎల్ అంటే కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్. అరబికా, రొబస్టా గ్రీన్ కాఫీ బీన్స్ను భారతదేశంతో పాటూ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుని కాఫీ ఉత్పత్తులను తయారు చేస్తోంది సీసీఎల్.
ప్రస్తుతం దుగ్గిరాల ప్లాంట్ ఏటా 20 వేల టన్నుల కాఫీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2009లో స్విట్జర్లాండ్లో స్థాపించిన ప్లాంట్ కెపాసిటీ సంవత్సరానికి 3 వేల టన్నులు. 2012లో వియత్నాంలోని
డాక్ లాక్ ప్రావిన్స్‌లో స్థాపించిన కాఫీ ప్లాంట్ రొబస్టా కాఫీకి పేరెన్నికగాంచింది. దీని కెపాసిటీ సంవత్సరానికి 10 వేల టన్నులు.
http://www.cclproducts.com/index.php
Comments
Post a Comment