సెట్‌టాప్
బాక్స్‌లు వున్న వాళ్ళకి శుభవార్త!
మొబైల్ పోర్టబిలిటీ లాగానే త్వరలోనే టీవీ ఇంటర్ఆపరేబిలిటీ తీసుకువచ్చేందుకు పనులు ప్రారంభించింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు ఇష్టం లేని సర్వీసు ప్రొవైడర్ నుంచి మారాలంటే ఏకంగా సెట్ టాప్ బాక్స్‌నే మార్చాల్సి వుంది. దీనివల్ల రెండు మూడు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాని ఇక నుంచి ఆ సమస్య ఉండదు. సెట్ టాప్ బాక్సులో కార్డు మార్చడం వల్ల సులభంగా సర్వీస్ ప్రొవైడర్ మారవచ్చని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడు, నాలుగో దశల కేబుల్ డిజిటలైజేషన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్‌కు అధ్యక్షత వహించిన మంత్రి టీవీ ప్రేక్షకులకు అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు

మూడో దశ డిజిటలైజేషన్ 2015 సంవత్సరం చివరి వరకు,
నాలుగో దశ 2016 సంవత్సరం చివరి వరకు పూర్తవుతుందని మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. మూడు, నాలుగు దశలు పూర్తయితే డిజిటలైజేషన్
సేవలు గ్రామాలకు కూడా అందుతాయన్నారు. కేబుల్
డిజిటలైజేషన్ ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్ ఇండియాలో భాగమని..అందుకే తాము చాలా వేగంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
సెట్‌టాప్ బాక్స్‌లు టెలికామ్ నెట్వర్క్ఎక్విప్మెంట్గా టెలికాం శాఖ ప్రకటిస్తే..దేశీయ కంపెనీలు తక్కువ ధరకే సెట్‌టాప్
బాక్స్‌లను ఉత్పత్తి చేస్తాయని..దీని కోసం టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
కూడా వేగవంతంగా చర్యలు చేపడుతున్నారని జవదేకర్
అన్నారు. మొదటి, రెండో దశ సెట్‌టాప్ బాక్స్‌లన్నీ దిగుమతి చేసుకున్నవేనని మంత్రి చెప్పారు.

Comments
Post a Comment