ఇప్పడిక రైల్వేలలో ప్రీమియమ్ తత్కాల్ టిక్కెట్లు
ప్రయాణీకులకు దీపావళి పండగ ఆఫర్ ఇచ్చింది
రైల్వేశాఖ. ఇదేదో వరం అనుకుంటే పొరపాటే.
తత్కాల్ టిక్కట్లను వ్యాపారంగా మార్చేసిన రైల్వే అధికారులు.. ఇపుడు మరింత దోపిడీకి సిద్ధమయ్యారు. ప్రయాణికుల అవసరాలను అదనుగా చేసుకొని.. వారి జేబులు గుల్ల చేసుందుకు రెడీ అయ్యారు. ప్రీమియం తత్కాల్ పేరుతో అత్యవసర టికెట్లను ప్రవేశపెట్టింది రైల్వేశాఖ.
తత్కాల్ కోటా టిక్కెట్లలో కోత విధించి ప్రీమియం పేరుతో రైల్వేశాఖ కొత్త ఖాతా తెరిచింది. తత్కాల్ టిక్కెట్లు పదిశాతం పూర్తవగానే ప్రీమియం టిక్కట్ల ధరలు అమల్లోకి వస్తాయి. విమానయాన సంస్ధలు ఫ్లైట్ బయలదేరే చివరి టైంలో ఉన్న గిరాకీని బట్టి
ఈ తరహా టిక్కట్ల ధరను నిర్ణయిస్తాయి.
స్లైడింగ్ ఫేర్ పేరుతో వేలకు వేలు వసూలు చేస్తాయి. అదే తరహాలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను రైల్వే ప్రయాణీకులకు అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్కు స్లీపర్ క్లాస్కు తత్కాల్లో 90 నుంచి
175 రూపాయల వరకు వసూలు చేస్తుండగా.. ఇక థర్డ్ క్లాస్ ఏసీకి 100 నుంచి
200 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
ప్రీమియం తత్కాల్లో పదిశాతం టిక్కట్లు పూర్తవగానే టిక్కెట్ ధరలపై
20 శాతం అదనంగా వసూలు చేస్తారు.
అలా టిక్కెట్ ధరలను పెంచేస్తూ విక్రయిస్తారు. కనీసంగా ప్రీమియంలో స్లీపర్ టిక్కెట్ 1200 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.
రైల్వే అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ప్రీమియం తత్కాల్ విధానం ప్రయాణీకులపై మరింత భారం పడనుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రయాణికులపై ఛార్జీల మోత మోగిస్తూ.. అరకొర సేవలు అందిస్తున్న రైల్వేశాఖ..
అదనంగా వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు.
వెంటనే ప్రీమియం తత్కాల్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments
Post a Comment