క్వాలిఫైడ్ టెక్నీషియన్లు కొరతతో తీవ్రమవుతున్న వ్యాధులు
పుట్టగొడుగుల్లా వ్యాధి నిర్ణారణ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. సరైన సిబ్బంది.. నైపుణ్యమున్న టెక్నీషియన్లు లేకుండా యధేచ్చగా నిర్వహిస్తున్నారు.
అలా పుట్టకొచ్చిన కేంద్రాలే క్షయ రోగుల పాలిటి శాపంగా మారుతున్నాయి. సరైన సమయంలో గుర్తించక మృత్యుఒడిలోకి చేరడానికి కారణమవుతున్నాయి.
ముంబయి నగరంలో ఇటీవల జరిగిన పరిశోధనలు ఆందోళనకర అంశాలను వెల్లడించాయి. దేశంలో మరే నగరంలో లేనంతగా టీబీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ముందస్త దశలో వీటిని గుర్తించడంలో ప్రైవేటు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు విఫలమవుతున్నాయని..
దీంతో మరణాలు రేటు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో 30వేల మంది రోగులకు మందులు ఇస్తున్నారు. మరో
6వేల మంది టీబీ మందులు కూడా పనిచేయని స్టేజికి చేరారని అధికారులు లెక్కగట్టారు.
క్షయ మందులు పనిచేయకపోవడానికి కారణం అధికంగా యాంటీ బయాటిక్ మందులు వాడకమే.
రోగికి క్షయ ఉందని గుర్తించడంలో విఫలమవుతున్న వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఇచ్చే రిపోర్టులతో వైద్యులు జలుబు, దగ్గు అంటూ యాంటీ బయాటిక్స్
మందులు సూచిస్తన్నారు. చివరకు అసలు జబ్బు బయటపడి మందులు వాడే సమయానికి శరీరం సహకరించడం లేదు. యాంటీ బయాటిక్స్
అధికంగా వాడడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది.
ఆహారం తీసుకోవడం కష్టంగా మారుతోంది. మందులు పనిచేయడం లేదు.
క్షయ వ్యాధి గ్రస్తుల్లో
50శాత మంది ముందుగా ప్రైవేటు లాబ్లలో పరీక్షలు చేయించుకున్నా..
వ్యాధిని నిర్ధారించలేకపోయినట్టు రోగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తయారుచేసిన నివేదికలు చెబుతున్నాయి.
గడిచిన ఐదేళ్లలో ముంబయి నగరంలో
7వేల మందిని పరీక్షించగా..
ఇందులో 1033 మందిలో టీబీ మందులు పనిచేయక మృతి చెందారు.
ఒక్క ముంబయి నగరంలో మాత్రమే కాదు..
అన్ని నగరాల్లో, పట్టణాల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిపుణులు కూడా లేకుండా పుట్టగొడుగుల్లా ల్యాబ్లు పుట్టుకొస్తున్నాయి.
వీటిపై ప్రభుత్వం నియంత్రణ విధించకపోతే మరింత ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా నమోదు అవుతున్న క్షయ కేసుల్లో 25శాతం భారతదేశంలోనే ఉంటున్నాయి.
దీంతో అప్రమత్తం కావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. క్షయ వ్యాధి గుర్తించడం ముఖ్యం.. దీని ఆధారంగానే ముందులు వాడాల్సి ఉంటుంది.. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

Comments
Post a Comment