గెజిటెడ్,నోటరీ సంతకాలకు ఇక చెల్లు
గెజిటెడ్ అధికారి సంతకం,. నిరుద్యోగులను, విద్యార్ధులను అడిగితే తెలుస్తుంది ఎంత విలువైందో?ఏదో ఒక సమయంలో అధికారి సంతకం కోసం తిరిగిన సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇప్పటికీ లక్షలాది మంది నిత్యం అధికారుల వద్దకు పరుగులు తీస్తుంటారు. లేదంటే నోటరీ కోసం పరుగులు తీస్తుంటారు.పరీక్షలకు హాజరుకావాలన్నా.. ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా.గ్యాస్ కనెక్షన్ కావాలన్నా...పాస్పోర్ట్ కి అప్లై చెయ్యాలన్న...బర్త్ సర్టిఫికేట్ కావాలన్న.....గెజిటెడ్ అధికారి సంతకం కావాలి.
అయితే ఈ కష్టాలు త్వరలోనే వీడనున్నాయి. గెజిటెడ్
అధికారి సంతకాలు, నోటరీ విధానాలకు సాద్యమైనంత త్వరగా వీడ్కోలు పలకాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా.. సెల్ఫ్
అటెస్టేషన్ను ప్రమోట్
చేయాలని లేఖలో పేర్కొంది.
అదే సమయంలో దీనిని పూర్తిగా తొలగించడానికి అవసరమైన సలహాలను కూడా కోరింది.
పాలనను సరళతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గెజిటెడ్
అధికారి వద్దకు చేరుకుని సంతకం తీసుకోవడం ఎంత కష్టమో తెలియంది కాదు..
ఇక నోటరీ అఫడవిట్
తీసుకోవడం కూడా వారికి భారమే.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సర్కార్
చెబుతోంది. ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలకు మాత్రం ఊరటనిస్తుంది.

Comments
Post a Comment