ఎండాకాలం ప్రేమలు మండే కాలం..
అన్నాడు ఓ సినీకవి..
కానీ వానాకాలం కూడా ఇలాగే తయారైంది..
చల్లటి వాతావరణంలో ఏ వేరుశనక్కాయలో తినాల్సిందిపోయి..
శీతాల పానీయాలు తాగాల్సివస్తోంది..
వర్షానికి తడిసిముద్దైపోతే వేడివేడి టీకి బదులు.. బాబోయ్ మంటా అంటూ చల్లని మజ్జిగ తాగాల్సివస్తోంది..
దుప్పటి కప్పి ముసుగు తన్నే సీనే లేకుండా పోయింది..
ఫ్యాన్ గాలికి గొంతులు బొంగుర్లు పోతున్నాయి..
కరెంటు బిల్లు చూసి కామన్మ్యాన్కు గుండె గుభేల్ మంటోంది.. వీటన్నింటికీ వానెండాకాలమే కారణం..
కాలాలు ఎన్ని..
అంటే ఎవరైనా మూడు అని టక్కున చెప్పేస్తారు.. ఎండాకాలాం..
వానాకాలం.. చలికాలం.. చిన్నప్పటి నుంచి చదువుకున్నవే కదా అంటారు..
కానీ ఇప్పడు ఉన్నట్టుండి మరో కాలం వచ్చిపడింది.. అదే వానెండకాలం.. అసలు వర్షాకాలమో.. ఎండాకాలమో తెలియని కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుండటమే ఇందుకు కారణం..
జోరుగా వర్షాలు కురుస్తాయి కాబట్టి వానాకాలం అంటున్నాం చలివణికిస్తుందంటే చలికాలమని వేరే చెప్పక్కర్లేదు..
బాబాయ్ దీనిగురించి చెప్పాల్సిన అవసరం లేదు..
ఎండాకాలం వస్తోందంటే జనం భయంతో వణికిపోతారు.. ఏ కాలంలోనైనా కొంత రిలాక్స్ ఉంటుందేమోగానీ సమ్మర్ వచ్చిందంటే అంతే సంగతులు..
అందుకే స్కూళ్లకు కూడా హాలిడేస్ ఇచ్చేది మరి
ఎండాకాలం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసిన జనాలకు ఈసారి తీవ్ర నిరాశే ఎందురైంది.. జూన్
మొత్తం ఎండలు బాదేశాయి..
కోస్తాలో అయితే కొన్ని చోట్ల పాఠశాలల్లో వేసవి సెలవులు కూడా పొడగించారు. వేసవి దెబ్బకు జనం పిట్టల్లా రాలారు.
ఇంతలో నైరుతి రుతుపవనాలూ ఊరించి ఉస్సూరుమనిపించాయి..
కొన్ని రోజులు ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పుకొచ్చారు భారత వాతావరణ అధికారులు.. మళ్లీ నార్త్లో కుండపోతలు కురవడంతో అదేం లేదన్నారు.. ఏమో వానరాకడ ప్రాణపోకడ ఎవరికి తెలుసన్నట్లుంది మన ఐఎండీ తీరు...
నైరుతి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిపించలేదు..
తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది..
ఈలోపు నైరుతి కూడా చాపచుట్టేసింది.. వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..
మరికొన్ని చోట్ల భూములు సాగుకు సైతం నోచుకోలేదు..
బోరుభావుల కింద నాట్లు వేసినా కరెంటు కోతలతో అవీ చేతికందలేదు..
ఎలాగోలా ఎగువన కురిన వర్షాలకు ప్రాజెక్టులు మాత్రం నిండుకుండను తలపిస్తున్నాయి..
వర్షాకాలం చివరి స్టేజ్లో ఉంది.. వానలు పడకపోయినా కొంత వాతావరణం చల్లగా ఉండాలి.
ఇప్పుడు అదీ లేదు..
ఎండాకాలాన్ని మించిపోయేలా భానుడు రెచ్చిపోతున్నాడు.
అసలు ఏకాలంలో ఉన్నామో కూడా తెలియని అయోమయం నెలకొంది..
ఇంకెంత కాలం ఇలా ఎండలు మండుతాయి..? ఎప్పడు ఉక్కపోతల నుంచి ఉపశమనం లభిస్తుంది..?
చలికాలంలోనైనా ఈ బాధలు తప్పుతాయా..?
అసలు వాతావరణం ఇలా అనూహ్యంగా మారడానికి కారణాలేంటి..? ఇప్పుడు జనంలో ఇదే చర్చ జరుగుతోంది..
మండుతున్న ఎండలతో బయటకు రావాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు... కార్మికులకు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు.. ఉక్కపోతలతో జనం అల్లాడుతున్నారు..
తెలంగాణ,
ఏపీ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదౌతున్నాయి.
4 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. కోస్తా,
తెలంగాణలో 4 డిగ్రీలు.. రాయలసీమలో ఐదుడిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి..
మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులే ఎండల తీవ్రతకు కారణంటున్నారు వాతావరణ శాఖ అధికారులు..
అసలే వర్షాలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు ఈ ఎండలతో బెంబేలెత్తుతున్నారు..
అంతపురం జిల్లాలో ఏకంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. కర్నూలులో
36 డిగ్రీలు.. నెల్లూరు, కళింగపట్నం,
ఒంగోలులోనూ 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డౌతున్నాయి..స్పాట్
తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.. ఉదయం 9 నుంచే భానుడు సుర్రుమంటున్నాడు.
స్కూల్స్, ఆఫీస్లకు వెళ్లే వాళ్లు నరకం చూస్తున్నారు. టూవీలర్ బయటకు తీయాలంటేనే ఇదేంకాలంరా బాబూ అనుకుంటున్నారు జనం..
ఎండల ప్రభావం సర్కారుపైనా పడుతోంది.
కరెంటు సరఫరా.. అసాధారణ పరిస్థితుల్లో అనారోగ్యం పాలౌతున్నారు. ఆసుపత్రుల్లోనూ కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు..
ఫ్యాక్టరీల్లో కార్మికులకూ తిప్పలు తప్పడం లేదు.. భానుడి ప్రతాపం కూరలకు గాయాలు చేస్తోంది..
సేదతీరుదామనుకున్న జనాలకు అదీ కష్టంగానా మారుతోంది. ఎండలకు తోడు కరెంటు కోతలు తీవ్రమౌతున్నాయి.
హైదరాబాద్లో అధికారికంగా
4 గంటలు కరెంటు కోసేస్తున్నారు.
అనధికారికంగా వేరే చెప్పనక్కర్లేదు. ఊళ్లలో అయితే ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు.. ఎండలవల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది.
వ్యవసాయంతో పాటు ఇళ్లలోనూ కరెంట్ వాడకం ఎక్కువైంది.
డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదు.. రానున్న రోజుల్లో హైదరాబాద్లో
6 గంటల వరకు కోతలు వేసే అవకాశాలున్నాయి..
కరెంటు ఉత్పత్తికి కూడా ఎండలు అంతరాయం కల్పిస్తున్నాయి.
బొగ్గు గనుల్లోనూ ఉక్కపోతలతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు కుదేలౌతున్నాయి. కొన్ని చోట్ల పవర్
హాలిడేలు.. మరికొన్ని చోట్ల కరెంటు కట్లు యజమానులకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి.
కార్మికులను రోడ్డున పడేస్తున్నాయి.. చిన్నపరిశ్రమలు,
కరెంటుపై ఆధారపడిన షాపులవాళ్లు బాధలు పడుతున్నారు..
ఎండలవల్ల సామాన్యుల తిండికీ తిప్పలు తప్పడం లేదు.. కూరగాయల రేట్లు ఆకాశానంటుతున్నాయి.. టమాటా మినహా మిగతావన్నీ కేజీ 40 రూపాయలు పలుకుతున్నాయి.
అసాధారణ ఉష్ణోగ్రతలతో దిగుబడులు తగ్గిపోవడం.. పంటలు ఎండిపోవడంతో రేట్లు ఏమాత్రం తగ్గడం లేదు.. ఎండలవల్ల జనం రోగాలపాలౌతున్నారు.. విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి..
ఇంకా ఈ వానెండకాలం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.. రెండు రోజులే అని వాతావరణ అధికారుల చెబుతున్నా.. వాళ్లు చెప్పింది ఎప్పుడూ నిజమైంది లేదు..
వర్షం వస్తుందని వాళ్లంటే.
అది రాదు. ఎండలు కొడతాయంటే వాతావరణం చల్లబడుతుంది. అదీ మనోళ్ల పనితీరు..
వాతావరణ పరిస్థితుల మార్పుకు ప్రధాన కారణం గ్లోబల్
వార్మింగ్.. సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఈ సిచ్యువేషన్ వెదర్పై పడుతోంది.. అటు ప్రకృతి వినాశనం శాపంగా మారుతోంది..
రియలెస్టేట్, ప్రాజెక్టుల పేరుతో పచ్చని అడవులను నేలమట్టం చేస్తున్నారు.
చెట్లను నరికి ఏడారిగా మారుస్తున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న పట్టణీకరణ ప్రమాదకరంగా పరిణమిస్తోంది..
ఇది గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టారా సరి లేదంటే..
మన పరిస్థితీ ఫ్యూచర్లో ఎడారిలా మారడం ఖాయం..

Comments
Post a Comment