తిరుపతి లడ్డూ షుగర్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా తయారుచేయకూడదా?

షుగర్ పేషంట్లను దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో లడ్డూని ఎందుకు తయారు చేయకూడదు. ఇప్పటికే మార్కెట్ లో షుగర్ పేషంట్ల కోసం ప్రత్యేక తీపి పదార్ధాలు అందుబాటులో వున్నాయి. అలాంటప్పుడు. అతి మధురమైన దైవప్రసాదం, తృప్తిగా సేవించే అవకాశం కోట్ల సంఖ్యలో వున్న మధుమేహ బాధితులకు ఎందుకివ్వకూడదు? ఇప్పుడు జనాభాలో షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తిరుపతిలోనే కాదు. శ్రీశైలంతో సహా అనేక పుణ్యక్ష్రేత్రాలలో లడ్డూనే ప్రసాదానికి ప్రామాణికంగా భావిస్తున్నారు. అన్ని పుణ్యక్షేత్రాలలో కూడా షుగర్ వ్యాధి బాధితులను దేవస్థానం అధికారులు కరుణించాలి. ధర్మశాస్త్రాల ప్రకారం దోషం లేకపోతే ఆలోచించాలని విన్నపం.

Comments