భోపాల్ గాస్


భోపాల్ గాస్ దుర్ఘటన సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం డిసెంబరు 3 అర్థరాత్రినుంచి జరిగి దాదాపు 2500మంది అధికారికంచగా చనిపోతే తరువాత రెండువారాలలో 8000 తరువాత ఆ గాస్ బారిన పడటం వల్ల మరో 8000 మంది చనిపోయారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 5 లక్షలపైబడి ఆ విషవాయులబారిన పడ్డారు. 4000మంది శాశ్వతంగా వికలాంగులు కాగా 38000మంది కొంతవరకూ వికలాంగులు అయ్యారు. ఇంకా ఆ తరం వచ్చే తరంపై ఆ రుగ్మతల ప్రభావం ఎంతో ఉంది. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మేం మహారాష్ట్రలో చదువుకుంటున్నాము. బొంబాయి, పూనే, షోలాపూర్ అన్ని చోట్ల ప్రతీ కర్మాగారాన్ని అనుమానంగా చూడటం కనిపించింది. తరువాత నేను అక్కడికి వెళ్లి చూసి వచ్చాను. అక్కడ స్లమ్స్లో అప్పుడు జనం లేరు. చుట్టుప్రక్కల మనుషులలో నిర్వేదం కనపడింది. అసలు విషయానికి వస్తే అప్పటి ప్రభుత్వం యూనియన్ కార్బైడ్ పారిశ్రామికాధిపతులని కాపాడటానికి
ఎంత ప్రయత్నించిందో అమాయకులని దాని తరువాత వచ్చే దుస్పరిమాణాలనుంచి కాపాడటంపై అంత దృష్టి పెట్టలేదు. అయితే ముందుగా న్యాయస్థానం 8మందికి ఉరిశిక్ష విధించింది. తరువాత జరిగింది మీకు తెలిసిందే. ఇక $470 మిలియన్ల డాలర్లు ఆ కంపెనీ కోర్టు బయట ఒప్పందం చేసుకుని కట్టింది. అయితే మరో లక్షమంది ఆ రోగాలతో బారినపడేవారికి ఇస్నూరెన్స్ కట్టాలని, వైద్యం నిమిత్తం అయ్యేఖర్చులు కంపెనీ కట్టాలని మరోసారి కోర్టు నిర్ణయించగా కంపెనీ ఆమోదించింది. దాని న్యాయ వివాదం, సామాజిక న్యాయంపై అనేక వాదోపవాదాలు ఉన్నాయి. ఎంతోమంది సాంఘిక సేవకులు పోరాటంపై జీవితాలు పెట్టారు. పారిశ్రామిక విప్లవం తరువాత దానివల్ల మానవాఌకి జరిగిన ఉపద్రవాలలో అత్యంత విషాదకరమైనది. వ్యవసాయం కోసం పురుగుమందులు తయారుచేయడంలో జరిగిన ఘట్టం అది. తలుచుకున్నప్పుడల్లా మనసు కలచివేస్తుంది.

మనం పాఠం నేర్చుకున్నామా? తరివాత కూడా పారిశ్రామిక కాలుష్యం వల్ల ఎన్నో దుర్ఘటనలు జరిగాయి. ఇప్పుడు పారిశ్రామిక ప్రమాదాలు సంభవించే అవకాశం ఇంకా విస్తరించింది. ప్రతీచోటా కాలుష్యకాసారంలాగా కొన్ని పరిశ్రమలు తయారయ్యాయి. మానవాఌకి సౌకర్యాల పేరిట మానవాఌని శాశ్వతంగా కబఌంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ భోపాల్ ప్లాంటులో కాలుష్యం వస్తుదని 1971లోనే రెండూ కార్మికసంఘాలు ఫిర్యాదు చేసాయి. పదే పదే అధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాయి. అనేకసార్లు గాస్ లీక్ అయింది కొన్ని సార్లు కార్మికులకి బర్న్ ఇంజరీస్ కూడా అయ్యాయి. కానీ కాలుష్య నివారణమండలి, ప్రభుత్వాలు నిద్ర నటించాయి. ప్రస్తుతం ఉన్న కర్మాగారాలలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఎవరైనా దృష్టి పెడుతున్నారా? స్లోపాయిజన్ లాగా వ్యాపిస్తున్నాయా? పారిశ్రామికంగానే కాకుండా పర్యావరణాన్ని అనిరకాలుగా చెరబట్టబోతున్నారా? ఇక్కడ మనం త్రాగేనీరు, త్రాగే పాలు, పీల్చే గాలి, తినేతిండి, కాయగూరలు, పండ్లు...ఇంకా కొంతైనా కాలుష్యం కబఌంచనివి ఏమైనా ఉన్నాయా? మనకి ఉన్న ఒకే ఇల్లు ఈ ధరిత్రే. మనం నివసించడానికి ఇంకో ఇల్లు లేదు. ఎందుకని మనకి ఈ నిర్లిప్తత. ఆలోచించండి. ఎపిలేదు...తెలంగాణలేదు.... మరో ప్రక్క రాష్ట్రం....దేశం వేరే వేరే కాదు. ఒకచోట మొదలైన కాలుష్యం అందరికి వ్యాపిస్తుంది. ప్రక్కింటిలో ఆర్డియక్స్, విషవాయులు స్టోర్ చేస్తే ప్రక్కనున్న మనం సౌఖ్యంగా ఉంటామని ఎలా అనుకుంటాము. మనందరి ఇంటిని...ఈ భూమాతను కాపాడుకునే యత్నానికి నడుంకడదాం. నా వద్దకు వస్తే చూద్దాంలో అనుకునే రోజులు పోయాయి. ప్రతీ ఒక్కరు మనసు పెట్టి ఆలోచించగలవారే.. ఒక్కసారి గుండె తలుపు తట్టండి . -చలసాని Srinivas Chalasani

Comments