అరటిపళ్ళు - ఆరోగ్య ప్రయోజనాలు (banana)

అరటిపళ్ళు - ఆరోగ్య ప్రయోజనాలు

1) ఎదిగే పిల్లలు , చదువుకొనే పిల్లలు , తక్కువ బరువు ఉన్నవారిలో శరీర దారుద్యానికి , జ్ఞాపకశక్తికి అరటిపండు ఎంతగానో సహాయపడుతుంది.
అరటిపండులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి , అధికమొత్తంలో యాంటి-ఆక్సిడెంట్లు , మినరల్స్ , విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా C విటమిన్ & B6 అధికమొత్తంలో ఉంటుంది. ఇంకా పొటాషియం అధికమొత్తంలో ఉంటుంది.

2) తక్కువ బరువుతో బాధపడేవారు , బరువు పెరగడానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో మరియు రాత్రి పడుకొనే ముందు ఒక అరటిపండు తిని ఒక గ్లాస్ పాలు త్రాగాలి.

3) అధికబరువు ఉన్నవారు మాత్రం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు. మద్యాహ్నం , రాత్రి తీసుకోవాలనుకుంటే బోజనానికి ముందు తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

4) సుఖవిరేచనం కావడానికి అరటిపండు ఎంతగానో దోహదపడుతుంది. శరీరానికి కావాల్సిన పీచు పదార్ధం అందుతుంది.

5) మొలలు(ఫైల్స్) వ్యాధిని తగ్గిస్తుంది , అల్సర్లు తో బాధపడేవారికి అరటిపండు ఉపసమనం కలిగిస్తుంది.

6) స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది.

7) మతిమరుపు సమస్యను తగ్గించి , బ్రెయిన్ పవర్ పెంచుతుంది.

8) రక్త హీనత లేకుండా చేస్తుంది, బీపి , గుండెజబ్బులు రాకుండా చేస్తుంది.

9) మొత్తంగా శరీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

10) ఎముకలు గుల్లబారిపోకుండా , దృడంగా ఉండేలా చేస్తుంది. మోకాళ్ళు , కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు అరటిపండు తీసుకోవాలి.

11) ఆటగాళ్ళు , స్పోర్ట్స్ టోర్నమెంట్ లో ఎక్కువగా ఆడేవాళ్ళు కు అరటిపండు సత్వరం శక్తిని ఇస్తుంది.

12) కంటి చూపు మెరుగుపడడానికి , వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అరటిపండు మంచి ప్రయోజనకారి.

13) ఇంకా కాన్సర్ రాకుండా కాపాడుతుంది.

14) కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్నా అరటిపండును నిత్య జీవితంలో తప్పని సరిగా తీసుకోవాలి.

మీ,
నాగబాబు (కాస్మటాలజిస్ట్ & డైటీషియన్)
— with Nagababu Cosmetologist.

Comments