ముడిచమురు (క్రూడ్ ఆయిల్) రేట్లు భారీగా తగ్గి -- oil rates


 అసలు ఈ ఆయిల్ రేట్లు పెరగడం వెనుక, అలాగే తగ్గడం వెనుక ప్రపంచాన్ని శాసించే ఆయిల్ లాబీలు ఉన్నాయి. 70లనుంచి 90లవరకూ సోవియట్ యూనియనే అత్యధిక ఉత్పత్తిదారు. అది విచ్చిన్నం అయినతరువాత సౌదీ, అమెరికాలు దాని ఉత్పత్తిని దాటిపోయాయి. ఇప్పుడు రష్యా ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తిదారుగా ఉంది. అయితే ఇప్పుడు అమెరికా రష్యా , వెనిజూలాలాంటి వామపక్ష దేశాలను చిక్కుల్లో పడేయటానికి పన్నిగ పన్నాగంలో ఒక భాగమని చిక్కుకుని ఆ రంగంలోని కొందరు విశ్లేషకులు అంటున్నారు. వామపక్షదేశాలు మొత్తం క్రూడ్ ఉత్పత్తిలో 24%వరకూ చేస్తున్నారు. వెనిజూలాలో మేటినెత హుగోఛావెజ్ మరణానంతరం పాలకులు సమర్థులు కాకపోవడంతో అక్కడ అశాంతి పెరుగుతుంది. నేడు ఈ ఆయిల్ ఇబ్బందుల వల్ల ఇంకా పెరిగి ప్రజలు తిరుగుబాటు చేస్తారని అమెరికా ఆశ కావచ్చు. ప్రపంచంలో నిర్థారితమైన ఆయిల్ నిల్వలలో అత్యధికం ఉన్నవి వెనిజూలాలో ననేది ప్రపంఛ పెట్తుబడిదారీ వ్యవస్థ నియంత్రించేవారికి ఆశపుట్టిస్తుంది. ఉత్తుంగ తరంగంలా ఛావెజ్ అమెరికాని ఒంటిచేత్తో ఛాలెంజ్ చేసింది తట్టుకోలేకపోతుంది అనుకుంటా. నాడు వాదంతో గెలవలేనిది ఆర్థికంగా క్రుంగదీయాలనుకుంటుందా? నేడు సౌదీతో సహా అన్ని దేశాలకంటే రష్యా ఉత్పత్తి ఎక్కువగా ఉంది. రష్యా ఆర్థిక వ్యవస్థ ఏకంగా 70% పెట్రోలియం ఉత్పత్తులైన క్రూడ్ ఆయిల్, సహజవాయువులాంటివాటిపై ఆధారపడి అదే శరీరంలో రక్తంలా ఉంది. కానీ 1990 గోర్బచేవ్ పెరిస్త్రోయికా గందరగోళంలో అక్కడ విదేశీ ఆయిల్ కంపెనీలు చక్రం తిప్పగా సహజవాయువు రంగం ఎక్క్లువ ప్రభుత్వం చేతిలోనే ఉండటం అదృష్ట్రంగా మారింది. ప్రపంచ సహజవాయువు ఎగుమతులలో దాని వాటా దాదాపు 20% కూడా ఉండేది. తరువాత ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజ్యంగామారి కిడ్నాపులు, మాఫియా మాయ రష్యాని శాసించాయి. దశాబ్దం క్రితం దివాళా స్థితికి అనేక ప్రభుత్వ కంపెనీలు వెళ్లాయి. అయితే పుతిన్ ఆయిల్ రంగంలో ప్రభుత్వ రంగం రోశ్నెట్ ద్వారా తిరిగి 50%పైగా చేసే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయిల్ ఎగుమతుల కంపెనీల లాభాలపై 70% వరకూ పన్ను వేసి ఆ తరువాత టేక్నాలజీ కంపెనీలు రావడానికి కొంత తగ్గించారు. నేడు అమెరికా కనుసన్నలలో ఉండే కెనడా ఇంకా అనేక దేశ నిపుణులు కూడా రష్యాని వదిలేశి వెళ్లిపోతున్నారంటే అమెరికా కుట్ర ఉండదనగలమా? ప్రపంచంలో అమెరికా అత్యధిక ఆయిల్ దిగుమతిదారు. అమెరికాలో క్రొత్త ఉత్పత్తి కేంద్రాల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడ్ అత్యధికంగా రేట్ల తగ్గుదల లక్షలకోట్ల వల్ల లాభం పొందుతోంది.
క్రెమియా, నాటో విషయంలో విబేధాలకు తోడు కొన్ని ప్రపంచరంగాలలో మరల సూపర్ పవర్ గా తిరిగిచేరాలని చూస్తున్న రష్యాని, కొరుకుడు పడని పుతిన్ ను శత్రువుగా భావిస్తూన్న అమెరికా అయినా తనకి ఒకకన్ను పోతే ఫర్వాలేదని రష్యాకి రెండు కళ్లూ పోవాలని కోరుకుంటుందా? పులిని ఎదిరించిన పిల్లికూన క్యూబా అనేవారం. కానీ అది కూడా లొంగిపోకపోయినా కొంత వొంగిపోవడానికి ఒక కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యా, వెనిజూలాలాంటి దేశాల ప్రాబల్యం వెనక్కువెళ్ళటం కూడా. రష్యాలో చీప్ ఆయిల్ బదులు shale or tight sandstone, సైబీరియా ఇతర చోట్ల ఆయిల్ తీయడం చాలాఖరీదు. అదే సౌదీలాంటి దేశాలతో పోలిస్టే ఏకంగా నాలుగైదె రెట్లు ఎక్కువ కూడా ఉంటుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నదని ప్రపంచ పెద్ద మీడియా చెబుతూంది. అంత స్థాయిలో కాకపోయినా రష్యా తీవ్రమైన ఇబ్బందులలోకి వెళ్లవచ్చు. కానీ దేశ అభివృద్దిశాతం 2014 మొదటి భాగంలో 1 % కూడా లేదు. రష్యా రూబుల్ 50% విలువకోల్పోయింది. రష్యాబాంకులు వడ్డీ రేటుని 65% వరకూ పెంచారు (10.5 - 17%). Russia loses about $2bn in revenues for every dollar fall in the oil price రష్యా అత్యధిక ఉత్పత్తిదారుగా ఉన్నా నిర్థారిత ఆయిల్ నిల్వలు మిగతా ఉత్పత్తి బాగా దేశాలతో పోలిస్తే తక్కువ. ఉదాహరణకు వెనిజూలా, సౌదీలు 2.80 మ MMbbl కెనాడా 1.75 లక్షలు ఉంటే రష్యాలో నిల్వలు 80,000 మాత్రమే. అయితే అమెరికాలో అంతకంటే తక్కువ ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే భారతదేశంలో ఆ లెక్క 6000లోపు. కానీ రష్యాలో నేటికీ పబ్లెక్ డెట్ తక్కువే. అయితే రష్యా స్థాయిలో కాకపోయినా కొంతవరకూ ఇరాన్ కూడా ఈ రేట్ల తగ్గుదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంక్షలవల్ల ఇరాన్ ఉత్పత్తి 2011తో పోలిస్తే సగానికి తగ్గిపోయింది. సిరియాకి వెన్నుదన్నుగా ఉన్న రష్యా, ఇరాన్లు ఇప్పుడు దానికి సాయం చేయలేవనేది అమెరికాకి ఉన్న ఒక ఆలోచన. కేవలం తాననుకున్నది సాధించటానికి ఇరాక్ ను పెనంమీదనుంచి పొయ్యలోవేసి వినాశనంవైపు నెట్టిన చందంగా సిరియాలో తన మాట నెగ్గలేదని, అస్సాద్ పాలన అంతం చేయలేకపోయామనే దుగ్ద కూడా ఉండవచ్చు. అయితే ఆనాడు రష్యామీద ద్వేషంతో ఆఫ్గాన్ తాలిబాన్లకు ఊపిరినిచ్చిన అమెరికా నేదు సిరియా, ఇరాక్లలో పెట్టిన తంపులకి అత్యంత తీవ్రవాద ఐయస్ఐయస్ కు ప్రాణంపోసినట్లైంది.
ప్రస్తుతం ఇదే రీతిలో ఉత్పత్తి కొనసాగితే 2015 ప్రథామార్థం వరకూ కూడా అయిల్ రేట్లుపెద్దగా పెరగవంటున్నారు. డిమాండ్ కన్నా సరఫరా ఎక్కువ ఉండబోతుందని ఒక అంచనా. అయితే అది నిర్ణయించేది పోలీస్ రాజ్యాలు. వారి కుట్రలు ఎలా ఉన్నా, ఏది ఏమైనా మిగతా అనేక అభివృద్ది చెందుతున్న దేశాలలాగానే మనదేశం అత్యధిక విదేశీమారకద్రవ్యాన్ని ఈ చమురుకు వెచ్చించుతుంది. మనదేశ అవసరాలలో దాదాపు 80% దిగుమతి చేసుకుంటున్న మనం ఆయిల్ రేట్లు తగ్గటాన్ని హర్షించాలి.- చలసాని Srinivas Chalasani

Comments